Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వదులుతారా?
- భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ
- చర్చల అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చిన ఇరు దేశాలు
- సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్చల కోసం ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాగా.. ఇప్పుడు అందరూ సింధు నదీ జలాల అంశంపై క్లారిటీ వచ్చింది.
READ MORE: Realme GT 7T: భారత్ లో లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ GT 7T.. ఫస్ట్ లుక్ విడుదల.!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ షరతులతో కూడినది. పొరుగు దేశంపై దౌత్యపరమైన చర్యలపై భారతదేశం వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సింధు నదీ జలాలు ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ నిలిపివేత అలాగే కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. “కాల్పుల విరమణ అంశంపై ఇవాళ భారత్, పాకిస్థాన్‌లు ఒక అవగాహనకు వచ్చాయి. ఇరుదేశాలు కాల్పులు, సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించాయి. భారత్ మొదటి నుంచీ ఉగ్రవాదంపై పోరు సలుపుతోంది. ఇకపైనా అదే విధానాన్ని కొనసాగిస్తుంది” అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
READ MORE: South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే!
కాగా.. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఏప్రిల్ 23న జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ”1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది” అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!