నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాతిపల్లి వద్ద ఈ నెల 16 న జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయడాన్ని జీర్ణించుకోలేని మస్తాన్.. షఫీని హత్య చేశాడు. షఫీ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ కూతుర్ని తనకి ఇచ్చి వివాహం చెయ్యలేదనే కోపంతో మస్తాన్ హత్య చేసినట్లు తేలింది. ఈ వివరాలను డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు.
READ MORE: Pakistan: టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షహబాజ్.. కారణం ఇదేనా..
కాగా.. ఈ నెల 16న నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో ప్రజలు హడలిపోతున్నారు. తాటిపల్లిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రావూరుకు చెందిన షేక్ షఫీ(52) కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నారు. దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా… తాటిపల్లి వద్ద షఫీని గొంతు కోసి హత్యచేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన కండలేరు డ్యామ్ పోలీసులు.. కేసు నమోదు చేశారు. దర్యా్ప్తులో కూతురు ప్రియుడే హత్య చేసినట్లు తేలింది.
READ MORE: Pakistan: టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షహబాజ్.. కారణం ఇదేనా..