జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం ఉద్యోగాలు చేయొద్దని స్పష్టం చేశారు. ఇది పేదల ప్రభుత్వం, అలసత్వం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూలో ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలని తెలిపారు.
READ MORE: Air Chief AP Singh: తేజస్ ఫైటర్ జెట్స్ ఆలస్యంపై వైమానిక దళాధిపతి సంచలన వ్యాఖ్యలు..
గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు, ఒక్క కొత్త చెట్టు కూడా నరక నివ్వొద్దని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇదే అదును చూసుకొని అటవీ అధికారులు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారని.. ఇక నుంచి పోడు సాగుగూర్చి బానర్ ఐటమ్ కథనాలు రావొద్దన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారం ఉన్నా రాష్ట్రాలలో కూడా ఇంటికి 5 లక్షలు ఇవ్వడం లేదని.. పేదవాడికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, పైరవీలు చేయొద్దని తెలిపారు. ఒకటికి పది సార్లు చెప్తున్న అనర్హులకు కాకుండా ఇల్లు ఇస్తే సస్పెండ్ కాదు, అంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఒక్క రూపాయి లంచం తీసుకున్న సహించేది లేది… ఇందిరమ్మ ఇళ్ల ముసుగు లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలన్నారు. నియోజక వర్గానికి 3500 ఇల్లు కాకుండా ఐటిడిఎ పరిధిలో ఇంకా పెంచుదామని తెలిపారు.
READ MORE: Yash Vs Ranbeer: ‘రామాయణం’ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్