Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్‌ఫెక్షన్ కారకం…!
- మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య
- అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం మంచిది కాదట
- అదే పనిగా నురగ వస్తున్నా, చెడు వాసన వ్యాధి కారకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
మూత్ర విసర్జన సమయంలో.. ముఖ్యంగా బలంగా పోస్తున్నప్పుడు నురగ రావటం మామూలే. దీనికి భయపడాల్సిన పనిలేదు. కానీ అదే పనిగా నురగ వస్తున్నా, చెడు వాసన కొడుతున్నా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్, మూత్రంలో సుద్ద (ప్రొటీన్/అల్బుమిన్) పోవటానికి సంకేతం కావొచ్చు. మీకు ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయో లేవో తెలపలేదు. సాధారణంగా కిడ్నీ సరిగా పనిచేయకపోవటం, మధుమేహం మూలంగా కిడ్నీ దెబ్బతినటం వల్ల మూత్రంలో సుద్ద పడుతుంది. కాబట్టి ముందు మీరు మూత్ర పరీక్ష చేయించుకోండి.
READ MORE: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్
ఇందులో ఇన్‌ఫెక్షన్ ఉన్నా, సుద్ద పోతున్నా బయటపడుతుంది. అలాగే కిడ్నీ పనితీరును తెలుసుకోవటానికి రక్తంలో క్రియాటినిన్ పరీక్ష కూడా అవసరమే. ఇవి రెండూ నార్మల్‌గా ఉంటే ఇబ్బందేమీ లేదనుకోవచ్చు. అంటే కిడ్నీ పనితీరు బాగుండి, మూత్రంలో సుద్ద లేకపోతే నురగ వస్తున్నా బాధపడాల్సిన పనిలేదన్న మాట. ఒకవేళ మూత్ర, రక్త పరీక్షల ఫలితాలు నార్మల్‌గా లేకపోతే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో కిడ్నీ దెబ్బతింటుంది. గ్లోమరులర్ నెఫ్రయిటిస్‌తోనూ మూత్రంలో సుద్ద పడొచ్చు. ఇలాంటి సమస్యలున్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాలి. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టయితే యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!