IPL 2025: ఎలిమినేటర్ ఆడితే.. టైటిల్ కష్టమా?
- రేపు ఎలిమినేటర్ మ్యాచ్
- ముంబై, గుజరాత్ మధ్య మ్యాచ్
- హై టెన్షన్ మ్యాచ్‌కి అంతా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
READ MORE: CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
అంతకు ముందు, ఆ తర్వాత ఎలిమినేటర్ లో పాల్గొన్న ఏ జట్టు కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ , గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్‌ను ఓడించింది. ఆ తర్వాత క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ పోటీపడ్డాయి. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ టీం ఫైనల్లో ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఏ ఒక్క జట్టు కూడా ఛాంపియన్ కాలేదు.
READ MORE: Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..
మరి ఈ సారి ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక పంజాబ్, ఆర్సీబీ జట్టులో ఎదో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తుందా చూడాలి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో టాప్-2 జట్ల మధ్య మొదటి క్వాలిఫయర్ జరుగుతుంది. తర్వాత 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్-2 గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఏదేమైనా జూన్ 3న ఫైనల్లో తలపడే జట్టేదే రేపే తేలనుంది.
తాజావార్తలు
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!