ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26) టాప్ స్కోరర్. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల పరుగులు చేశారు.
READ MORE: Chiranjeevi : గద్దర్ అవార్డుల విజేతలకు కంగ్రాట్స్.. చిరంజీవి ట్వీట్
మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండవ ఓవర్లోనే యష్ దయాల్ ప్రియాంష్ ఆర్య (7) వెనుదిరిగాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (18)ను అవుట్ చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ తన తొలి ఓవర్‌లోనే ప్రత్యర్థి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (2)ను పెవిలియన్‌కు పంపించాడు. పవర్‌ప్లేలో పంజాబ్‌కు జోష్ ఇంగ్లిస్ రూపంలో మరో దెబ్బ తగిలింది. నాలుగు పరుగులకే జోష్.. హాజిల్‌వుడ్ చేతిలో ఔటయ్యాడు. నేహల్ వధేరా (8) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఆ జట్టు 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సుయాశ్ శర్మ ఓవర్‌లో శశాంక్ సింగ్ (3) ఔటయ్యాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన ముషీర్ ఖాన్ (0) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సుయాశ్ శర్మ వేసిన ఓవర్‌కు స్టాయినిస్ (26) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ (4), ఒమర్జాయ్ (18) కూడా పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ హాజిల్‌వుడ్ తలో 3 వికెట్లు తీసుకోగా యశ్ దయాల్ రెండు వికెట్లు, భూవీ, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు..
READ MORE: Jodha-Akbar: జోధా-అక్బర్ పెళ్లి నిజం కాదు, బ్రిటీష్ ప్రభావిత భారత చరిత్ర: రాజస్థాన్ గవర్నర్