KCR: రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు.. కేసీఆర్ సంచనల ఆరోపణలు..!
- ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ముగిసిన కేసీఆర్, హరీష్‌రావు భేటీ
- సుమారు మూడున్నర గంటలపాటు సాగిన సమావేశం
- కాళేశ్వరం కమిషన్ ఏర్పాటుపై కేసీఆర్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.
READ MORE: Amit Shah: యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్ టూర్‌లో అమిత్ షా భరోసా
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్తో పల్లా, నిమ్మల భేటీ
కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన రిపోర్టును నిర్మాణ సంస్థ L&T తప్పు పట్టడంపై చర్చించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్‌బీఎస్‌ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పొర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరనున్నట్లు నిర్ణయించారు.
READ MORE: Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుల అరెస్ట్..
కాగా.. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల తెలిసింది. జూన్ 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీసు పంపారు. దానికి స్పందించి హాజరుకావాలా లేదా అన్నదానిపై కేసీఆర్ న్యాయ నిపుణులతోనూ, పార్టీ నాయకులతోనూ చర్చిస్తున్నారు. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు ఇలా అనేక అంశాలను కమిషన్‌కు వివరించవచ్చని నాయకులు చేసిన సూచనతో ఏకీభవించిన కేసీఆర్ హాజరుకావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!