వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు..
READ MORE: RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది వివరిస్తామని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరగాలన్నారు. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకపాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పాలని.. రెడ్‌బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలన్నారు. ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్‌లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థుల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
READ MORE: MPs Suspend: హాకా నిరసన.. పార్లమెంటు నుంచి ముగ్గురు ఎంపీలు సస్పెండ్..!