Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉంది
- అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామన్న మాజీ మంత్రి
- కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వచ్చిందన్న అంబటి
- మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.
READ MORE: Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్ చేశారని.. బెదిరించి, భయపెట్టాలని చూశారన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. “లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. కేసులకు నేను భయపడను… డోంట్ కేర్… న్యాయస్థానంలో తేల్చుకుంటా. సీఐని వదిలిపెట్టేది లేదు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నాపై స్పీడుగా కేసులు పెట్టి… నా ఫిర్యాదులపై కేసు నమోదు చెయ్యలేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు, జైలుకెళ్లడానికి భయపడకూడదు. తుని ఘటనకు సంబంధించి జీఓ ఇచ్చారు… మళ్లీ రద్దు చేశారు. సీఎం, హోంమంత్రి, మంత్రులకు తెలియకుండా జీఓ వస్తుందా? రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబెట్టిన కేసుపై ఎవరికీ తెలియకుండా జీఓ వచ్చిందంటే ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చెయ్యడమే తప్ప మంచి పాలన చెయ్యలేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేషీలో పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. జగన్ ను మీరు అనుకున్నా అరెస్ట్ చెయ్యలేరు. రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాస్ లీడర్ జగన్. డీజీపీకి ఇప్పటికి యాభైసార్లు ఫోన్ చేశా… కానీ ఆయన స్పందించరు. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. న్యాయస్థానాలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా. వంగవీటి రంగా హత్య తరహాలో పోలీసులు హత్య కూడా చేయిస్తారేమో.. ఇది రాబోయేకాలంలో ప్రమాదకరంగా మారొచ్చు. పోలీసులు టీడీపీ గూండాల్లా పనిచేస్తున్నారు. మంచి పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!
తాజావార్తలు
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!