నెల్లూరులో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జీజీహెచ్ సిబ్బంది గుర్తించారు. అనుమానితుల నమూనాలను వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్ కి పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లో ఒక వెయ్యి 238 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇదిలా ఉండగా ఏపీలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
READ MORE: Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్
తాజాగా అనంతపురం జిల్లాలో కరోనా కేసు నమోదయ్యింది. జిల్లాలో ఇది తొలి కేసు. అనంతపురంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరగా.. అనుమానంతో కరోనా టెస్ట్ నిర్వహించారు. డాక్టర్లు అనుమానించినట్లే ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. హోం ఐసోలేషన్‌లో ఉంటానని వైద్యులకు మహిళ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో కొవిడ్ కేసు నమోదు అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.