సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. బీపీఎల్ కింది వర్గాలకు ఆర్థిక సాయం చేసే పద్ధతి పోయిందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. చెరువులను తెంపి చాపలు పంచే విధానంగా సంక్షేమము మారిందన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ, పి ఆర్ ఆర్ బి, మహిళా సీ సంక్షేమ శాఖలకు గతంతో పోలిస్తే అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని.. అందుకే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా తెలంగాణ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్…
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'రాబిన్ హుడ్' సినిమాలో వార్నర్ స్పెషల్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు సాధించాడు.…
ఐపీఎల్ (IPL) సీజన్ మొదలైతే చాలు, పాత రికార్డులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రతి సీజన్లో ఉన్న రికార్డులు బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన ఫీట్లను అందుకోవడం మాత్రం అంత తేలిక కాదు. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్ వెల్ సరసన చేరాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా.. రోహిత్ శర్మ సైతం 18…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా ఎస్ఆర్హెచ్దే.
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు జట్లు లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే…
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.