తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని ఘాట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. […]
గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం" అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే వింటారు. లీగల్ గానే పనిచేస్తారన్నారు. ఈ…
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. "ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరయింది కాదు.
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూయించారు. ఫొటోను చూసిన యువతి.. రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని గుర్తు పట్టింది. ఏడాది క్రితమే మాహేశ్ భార్య అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేశ్ పాత నేరస్తుడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపాన సీ-టైపు కాలనీలో నివాసం ఉన్నారు.…
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 సిక్సర్లు కొట్టాడు
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది. గత విచారణ సందర్భంగా స్పీకర్ తో…