మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం దీనికి మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు ఐక్యంగా ఉండగా, ఇండియా బ్లాక్ దీనికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో ఈ వక్ఫ్ బిల్లుపై వాదనలు జరుగుతున్నాయి. పార్లమెంటులో చర్చకు ఎనిమిది గంటలు కేటాయించారు. ఇందులో ఎన్డీఏకి మొత్తం 4 గంటల 40 నిమిషాల సమయం ఇచ్చారు.
ఒక్క వాహనం కాదు, వందల వాహనాల చప్పుళ్లు మార్పు శంఖారావాలా మారుతున్న ఈ ప్రయాణం పేరు – "యూనిటీ డ్రైవ్ – యునైటింగ్ ది నేషన్స్ ఆన్ వీల్స్". వన్ సీ (Onesea) మీడియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, హైదరాబాద్ నుంచి స్పితి వ్యాలీ దాకా కొనసాగనుంది. మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి విలువలపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడమే లక్ష్యం.
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
హెచ్సీయూ 400 ఎకరాల భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూ వద్ద ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించిన భూమిని వైఎస్ ఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ హయాంలో ఐఎంజీ…
హైదరాబాద్లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి షాపింగ్ కోసం బయలుదేరింది. క్యాబ్లో గంటన్నర…
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని విమర్శించారు. అవి సెంట్రల్…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే ఐదుకో పదుకో ఇచ్చే పరిస్థితి ఉండేదని…
హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులు నిరసనకు పిలుపునివ్వడంతో అడ్డుకునేందుకు…