కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని యత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అటువంటి భూమిని కేంద్ర అనుమతి లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు. పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్‌సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్‌సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద టెన్షన్…
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.…
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితిలు తెలుసుకునేందుకు ఈ…
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు. అనంతరం.. గోపన్‌పల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. సర్వేలో…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి.