కొడాలి నానిని ముంబై తరలించే అవకాశం ఉంది.. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది.. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించే అవకాశం ఉంది. కొడాలి కి హార్ట్ లో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రా లోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో హరిత విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ముందు బీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని పేర్కొన్నారు. "బీఆర్ఎస్ 25 లక్షల చెట్లు కాళేశ్వరం కోసం నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచ, గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతి నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు, పట్టిన చేతులు మారాయి. తెలంగాణలో పాలన లేదు.…
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని డాక్టర్లు సూచించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు..
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గ్రామస్థులు నిందితులకు…
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన రాజకీయ జీవిత కథను స్వయంగా రాసుకున్నారని ప్రకటించారు. సినిమా టీజర్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, హీరోలు ఎవరైనా ఇతరుల రాసిన కథల్లో నటిస్తారని, కానీ తాను నిజజీవితంలో పోలీసులను ఎదుర్కొన్నానని, ఫైట్లు చేశానని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వేరే పాత్రల ద్వారా చూపించడంతో పాటు, తాను కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌తో…