కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడారు. గోదావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తుంటే.. బీఆర్ఎస్ వాళ్లు రివర్స్‌లో తమపై నిందలు వేస్తున్నారన్నారు. ఏపీ సీఎం 300 టీఎంసీల ప్రణాళికా సిద్ధం చేసుకుంటున్నారని వెల్లడించారు. 400 టీఎంసీలు తీసుకుపో అని కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. తాము రాసిన లేఖకు కేంద్రం నుంచి రిప్లై కూడా వచ్చిందని స్పష్టం చేశారు. తాము ఎక్కడా బాధ్యత నుంచి తప్పుకోలేదన్నారు… పాపానికి పునాది వేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. శిక్ష వేయాల్సింది హరీష్, కేసీఆర్‌కి.. ఉరి తీయాల్సి వస్తే ఇద్దరికి వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Himanta Biswa Sarma: మతతత్వ శక్తులకు రాహుల్ గాంధీ రక్షణ..
హరీష్ చేయాల్సిన కుట్రలు చేసి. బురద తమకు అంటించే పని చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలను ప్రదర్శించారు. “హరీష్ చిల్లర పనులు మానుకో.. చిన్న పిల్లగానివి కాదు..ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు.. మేము సైలెంట్ గా ఉన్నాం అని అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టినవు. మీరు అప్పు ఇస్తాం అంటే వస్తాం ఫార్మ్ హౌస్‌కి. ఎక్కడ దాసుకుంటావు. అడ్డగోలుగా సంపాదిస్తే బీపీ.. సుగర్‌లు వస్తాయి. అనవసరంగా ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. బావ, బామ్మర్ది కలిసి రూ. 50 వేల కోట్లు అప్పు ఇవ్వండి. మేము బాండ్లు ఇస్తాం.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Sonyliv : జూలై4 నుంచి ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ స్ట్రీమింగ్