తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం…
మరికాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానున్నారు. హెచ్సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేదావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ఆలోచనలు చేయనుంది. సమస్య సద్దుమణిగాక…
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న…
హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం ఉంటుంది. ఈనెల 23వ తేదీన పోలింగ్…
సీపీఐ నేత నారాయణ హెచ్సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు విద్యా వ్యవస్థకే కేటాయించినవని తాము స్పష్టంగా…
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్రూమ్కు వెళ్లిన తన కూతురిని అక్కడే ఓ దుండగుడు వేధింపులకు గురిచేశాడని…
అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే, ఇప్పటికే కొనుగోలు చేసిన ఉత్పత్తులను వర్షానికి లోనుకాకుండా వెంటనే గోడౌన్లకు…
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమష్టిగా పని చేయాలని…
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పూజల కోసం ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల గేటు తెరిచి ఉంచిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం, బలిపూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.