ఏపీ సీఎం చంద్రబాబుకి టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. మోడీ మీరు చెప్తే వినొచ్చు.. కానీ మా ప్రయోజనాలు వదులుకోలేమని రేవంత్‌రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై సీఎం రేవంత్ మాట్లాడారు. మా హక్కులు హరిస్తే న్యాయ స్థానాలు ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలు 3 వేల టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి అనుకుంటే.. మా 968 టీఎంసీల వాటా వాడుకునేందుకు క్లియర్ చేయాలని సూచించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల మీకు నీళ్ళు వస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టులు మంచిగా కడితే.. స్టోరేజ్ చేసుకోగా.. వరద ఎంత వస్తుందో తెలిసేదన్నారు. మీరు గ్యాప్ పెంచుకుంటే మంచిది కాదని చంద్రబాబును ఉద్దేశించి రేవంత్‌రెడ్డి అన్నారు. మాకు కేటాయించిన నీటి వినియోగానికి ఎన్‌ఓసీ ఇవ్వాలన్నారు. వ్యక్తులుగా కాదు.. రెండు రాష్ట్రాలుగా ఆలోచించాలని సూచించారు. కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఒత్తిడి తో.. కిషన్ రెడ్డి తప్పించుకున్నారన్నారు.. రేపు కేంద్ర మంత్రిని కలుస్తామని.. కిషన్ రెడ్డి కూడా రావాలని కోరారు.
READ MORE: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
2019 అక్టోబరులో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారు.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్టు ఆ నాడు ఓ పత్రికలో రాశారు అని సీఎం తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృషా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.