ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయనను నియమిచింది. దీంతో కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీతో శశి థరూర్ విభేదాలు తెరపైకి వచ్చాయి.
READ MORE: Viratapalem: PC Meena Reporting: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్
ఈ అంశాలపై తాజాగా శశి థరూర్ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. నాకు పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాను. ఈ రోజు వాటి గురించి మాట్లాడకూడదనుకుంటున్నాను. సమయం రావాలి, అప్పుడు నేను మీతో చర్చిస్తాను. ఇప్పుడు.. ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన విషయాలపై మాత్రమే ప్రధానితో చర్చ జరిగింది. దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు.. దేశం వైపున నిలబడటం మన బాధ్యత. దేశానికి నా సేవ అవసరమైనప్పుడు, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Eatala Rajendar: తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?.. సీఎం వ్యాఖ్యలపై ఈటల కౌంటర్
కాగా.. ఇటీవల శశి థరూర్ అనేక సందర్భాల్లో ప్రధాని మోడీని ప్రశంసించారు. ఎస్ జైశంకర్‌ను విదేశాంగ మంత్రిగా, అశ్విని వైష్ణవ్‌ను రైల్వే మంత్రిగా నియమించడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నాయకులను శశి థరూర్‌కు మంచి స్నేహితులుగా భావిస్తారు. థరూర్ ఎప్పటికప్పుడు ప్రధాని మోడీని, నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. దీంతో థరూర్ బీజేపీలోకి వెళ్తారనే వాదనలు వినిపించాయి.