గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడటంతో జన జీవనం స్తంభించింది.
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని లక్ష్యాన్ని సమర్థించగల ముస్లిం ఎంపీ బీజేపీలో…
వక్ఫ్ సవరణ బిల్లుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు సహనం, వైవిధ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా అందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూనే, ఇమ్రాన్ మసూద్ తాజాగా ఏర్పడబోయే బోర్డు గురించి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారని, వారిలో 10 మంది మాత్రమే ముస్లింలు ఉంటారన్నారు. ఈ విధంగా.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సోదరుల మెజారిటీ ఉంటుందని చెప్పారు.
లోక్‌సభలో వక్ఫ్ చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నవ్వుకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావించే బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పార్లమెంట్ లో సభ్యులు మొత్తం నవ్వారు. అఖిలేష్ ప్రకటనకు అమిత్ షా స్పందించి ప్రసంగం మధ్యలో లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఈ విషయం చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయని.. ఐదుగురి నుంచే ఆ పార్టీ…
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు! పాట్నాలోని చికిత్స అందించారు. అనంతరం వైద్యులు ఆయనను ఢిల్లీకి వెళ్లమని సలహా ఇచ్చారు. లాలూ యాదవ్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆయనకు తగిలిన పాత గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఉదయం లాలు ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం.. రబ్రీ నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఎయిర్…