Triple Murders: హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఈ హత్యల్లో మిస్టరీ ఏంటి..?
- హైదరాబాద్‌లో ఆందోళన కలిగిస్తున్న వరుస హత్యలు
- సయ్యద్ సాహెబ్ అనే యువకుడిపై కత్తులతో దాడి
- బర్త్ డే పార్టీకి పిలిచి.. ప్లాన్ ప్రకారమే కత్తులు హత్య
- తిమ్మాయిగూడలో వెలుగులోకి మరో హత్య
- ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి ఫ్లై ఒవర్ కింద వేశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా… నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి…? హైదరాబాద్ నగరం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నా… నిత్యం గల్లీ గల్లీలో పోలీసుల గస్తీ ఉన్నా.. వరుసగా జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో ఒకే రోజు జరిగిన మూడు హత్యలు కలకలం రేపుతున్నాయి..
READ MORE: Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
కూకట్‌పల్లి పరిధిలోని వివేకానందనగర్ డివిజన్ బాలకృష్ణ నగర్ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. సయ్యద్ సాహెబ్ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి చంపారు. బర్త్ డే పార్టీకని పిలిచి సాహెబ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశామని.. బోరబండకు చెందిన సాహెబ్‌ను కూకట్‌పల్లికి పిలిచారు స్నేహితులు. రాత్రి మద్యం తాగిన యువకులు… సాహెబ్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ముందుగానే కత్తులను తెచ్చుకున్నారు నిందితులు. మద్యం మత్తులో ఉన్న సాహెబ్‌ను కత్తులతో పొడిచి చంపారు. మృతుడు సయ్యద్ సాహెబ్.. బోరబండకు చెందిన వాహిద్ పైల్వాన్ కుమారుడిగా గుర్తించారు పోలీసులు. మద్యం తాగుతున్న సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగిందా..? లేక పాత కక్షలను మనసులో ఉంచుకుని ప్లాన్ ప్రకారం హత్య చేశారా? అనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..
READ MORE: Dil Raju: సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడు!
నాగోల్ పరిధిలోని తిమ్మాయిగూడలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బండరాయితో తలపై మోది దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు అశోక్ గా గుర్తించారు. అశోక్… కాచిగూడలో జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు. కాచిగూడకు చెందిన అశోక్.. నాగోల్‌కి ఎందుకు వచ్చాడు. ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్… క్లూస్ టీమ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు..
READ MORE: Captain Cool: ‘కెప్టెన్ కూల్’ ట్యాగ్‌లైన్‌కు ధోనీ ట్రేడ్‌మార్క్ దరఖాస్తు..!
బహదూర్‌పురలోనూ మరో హత్య జరిగింది. బహదూర్‌పుర ఫ్లైఓవర్ కింద ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. హత్యకు గురైన యువకుడు ఎవరు అనేది ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి ఫ్లై ఒవర్ కింద వేశారా..? లేదా అక్కడే హతమార్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!