మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు తుది ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in నుంచి తుది ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుందాం..
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగించింది. ఈ బంగారం 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదంతా నిరుపయోగంగా ఉందని..ఈ వెయ్యి కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్వర్ణాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ.17.81 కోట్లు వడ్డీ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.
వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశపై తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వారి కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జెపిసి) ఛైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు.ఈ చట్టంలో ఒక్క తప్పు తేలితే, తాను తన ఎంపీ…
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్‌ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా విమర్శించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం యొక్క రాజ్యాంగ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.