ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్‌లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
ఆ మహిళా యూట్యూబర్ పేరు కనికా దేవ్రానీ. బ్రహ్మపుత్ర మెయిల్‌లో ఢిల్లీ నుంచి అస్సాంకు ప్రయాణించింది. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నందున భద్రత కోసం 2ACని ఎంచుకుంది. ముందు జాగ్రత్తగా ఆమె తన ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని.. తన బెర్త్ చుట్టూ కర్టెన్లను తీసి, నిద్రపోతుంది. అప్పుడే.. గుర్తు తెలియని వ్యక్తి టికెట్ లేకుండా 2AC కోచ్‌లోకి ప్రవేశించాడు. సీట్ల సంఖ్యల గురించి ఆరా తీశాడు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులపై మత్తుమందు స్ప్రే చేశాడు. వాళ్లు మత్తులోకి జారుకోగానే.. విలువైన వస్తువులను దొంగిలించాడు. ఈ అంశంపై తాను ఎంత ప్రయత్నించినా, రైల్వే పోలీసుల నుంచి తనకు పెద్దగా సహాయం అందలేదని ఆ యువతి పేర్కొంది. అస్సాం పోలీసుల నుంచి కూడా మద్దతు రాలేదని వీడియోలో వెల్లడించింది.
READ MORE: Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
యూట్యూబర్ కనికా దేవ్రానీ తన వీడియోలో భారతీయ రైళ్లలో భద్రత లేకపోవడాన్ని పదే పదే నొక్కి చెప్పారు. “సురక్షితంగా ప్రయాణించండి” అని ప్రేక్షకులను కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తించింది. ఆమె వీడియో 44 వేలకు పైగా లైక్‌లు, దాదాపు 860 వ్యాఖ్యలతో వైరల్ అయింది. రైల్వేలో భద్రతా లోపం, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన లోపాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. భారత రైల్వేలు త్వరిత చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.