అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు.
తిరుమల అలిపిరి సమీపంలో వదలని చిరుతల బెడద పెరుగుతోంది. తాజాగా జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేట్ మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చిరుతను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 6వ తేదీ వేదిక్ యూనివర్శిటీలో బోనుకు ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు సమాచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు పడి ఉన్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందులో తీసుకెళ్లలేమని పైలట్లు చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు. అయితే, ఇందులో నిజానిజాలెంత అనే దానిపై విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది.
పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది.
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది. ఎందుకంటే.. పాకిస్థాన్ భారతదేశ సైనిక శక్తి…
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.
చంచల్ గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టి గట్టిగా కేకలు వేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షినితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులు అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించారు. జైల్లో అఘోరీ ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. చంచల్ గుడా జైలును నిన్న సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్ ను పరిశీలించారు. ఇప్పటికే…
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.