ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలోని సారం తగ్గిపోతుందంటూ ముఖ్యమంత్రికి సూచించారు.
READ MORE: Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?
2023- 24 రబీతో పోలిస్తే 2024- 25 లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు 12.4% అదనపు వినియోగం జరిగిందని తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్ళించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఎరువులు సేంద్రీయ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు PM PRANAM పథకం గురించి ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా తెలంగాణ అధికారులకు వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులు తెలిపారు.