పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలువురు నాయకులను ఉద్దేశించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. తనని నమ్ముకున్న వాళ్లని తాను ఎప్పుడూ మర్చిపోనని సీఎం రేవంత్ అన్నారు. తనని నమ్ముకున్న వాళ్లలతో అద్దంకి దయాకర్ ఉన్నారని.. దయాకర్‌కు ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది..
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉరితీసిన తప్పులేదని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినా.. రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారని స్పష్టం అవుతుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగాలని కేసీఆర్ అంటున్నారని..
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి.. చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని..…
సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్ ఛైర్మన్ గా శాంతి కుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవి విరమణ తర్వాత.. ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు షాక్ తగిలింది. భూదాన్ భూముల వ్యవహారంలో సీనియర్ అధికారులపై సంచలన ఆరోపణలు వచ్చాయి. మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంలో భూదాన్ భూములను లే అవుట్ చేసి అమ్మిన వాళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది.. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ ఇళ్లపై ఈడీ సోదాలు చేపట్టింది. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే..
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న అట్టారీ…
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకి పంపారు సైబర్…
1947లో భారతదేశం, పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భారత్ నుంచి పాక్‌కు వెళ్లారు. పాక్ నుంచి కూడా లక్షలాది మంది భారత్ కు వచ్చాయి. అయితే కొంత మంది మాత్రం తమ ఇళ్లను, ఊరిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం మన దేశంలో నివసిస్తున్న ముస్లింలు అందరూ భారత్‌ను విడిచి పెట్టి వెళ్లలేక ఇక్కడే ఉన్నారు. పాకిస్థాన్‌లోని హిందులు మాత్రం దాదాపు అందరూ తిరిగి వచ్చారు. కానీ.. ఓ కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని..
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.