ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED) తయారు చేయడానికి.. అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారని వెల్లడించింది. గోరఖ్‌నాథ్ ఆలయ దాడిలో, నిందితుడు పేపాల్ ద్వారా సుమారు రూ.6.7 లక్షలు విదేశాలకు పంపినట్లు తెలిపింది. అందుకుగానే వీపీఎన్ సేవను ఉపయోగించి తన స్థానాన్ని దాచిపెట్టాడని సంచలన విషయాన్ని చెప్పింది. నివేదిక ప్రకారం.. ఉగ్రవాదులు ఇప్పుడు ఈ-కామర్స్ నుంచి 3D ప్రింటర్లు, రసాయనాలు, ఆయుధ భాగాలను కూడా ఆర్డర్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు బట్టలు, పుస్తకాలు, సంగీతం వంటి వారి ప్రచార సామగ్రిని అమ్మడం ద్వారా నిధులు సమకూరుస్తున్నాయి.
READ MORE: Off The Record: చింతలపూడి వైసీపీలో ఆధిపత్య పోరు
పుల్వామా దాడిలో ఏం జరిగింది?
2019లో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.