పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరైంది. వణుకుతున్న స్వరంతో "సార్.. మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం.' అన్నారు.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్లో ఉన్న ఇంటిని జమ్మూకశ్మీర్ పరిపాలన బుల్డోజర్ తో కూల్చివేసింది.
బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది.
ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.
విశాఖలో కలకలం రేపుతున్న స్కూల్ విద్యార్ధిని మృతి కేసు కలకలం రేపుతోంది. తల్లీ, అమ్మమ్మలపై అనుమానం వ్యక్తమవుతోంది.. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. తండ్రికి తెలియకుండా చర్చికి తీసుకొచ్చారు. బాలిక పూర్ణ చంద్రిక గత కొన్ని రోజులుగా…
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని సంచలన…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
మెట్రో రైలు లో బెట్టింగ్ ప్రమోషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందులో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.