పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆ
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరబాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ జవానును పాక్ బంధీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడిని తిరిగి ఇవ్వడంపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా దుఃఖం, కోపం అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. ఉగ్రదాడుల్లో చురుకుగా పాల్గొంటున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను నిఘా సంస్థలు సిద్ధం చేశాయి. ఈ స్థానిక ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక మద్దతుదారులుగా సంస్థలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులకు మద్దతు, రవాణా సహాయం, ఉగ్రవాదులకు ఆశ్రయం, వనరులను సమకూరుస్తున్నారని తేల్చాయి. ఈ 14 మంది ఉగ్రవాదుల లిస్ట్‌ను జాతీయ మీడియా సంస్థ "ఆజ్ తక్" వెల్లడించింది. వారిని ఒక్కొక్కరిగా హతం చేయాలని భద్రతా దళాలు నిర్ణయించుకున్నాయి.…
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థానీయులను వివాహం చేసుకున్న చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థానీ వ్యక్తులను పెళ్లి చేసుకున్న హిందుస్థానీ మహిళలు.. భారత్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి అత్తమామల ఇళ్లకు(పాక్) వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలాంటి అనేక మంది మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు నిలిపి వేశాయి. బీఎస్ఎఫ్ ప్రకారం.. పాకిస్థానీయులు దేశం దాడి వెళ్లేందుకు ప్రభుత్వం 48 గంటల కాలపరిమితిని ఇచ్చింది. ఇందులో దాదాపు 287 మంది పాకిస్థానీ పౌరులు సరిహద్దు దాటి భారతదేశం నుంచి…
సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. "సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం ప్రవహిస్తుంది" అని భుట్టో శుక్రవారం జరిగిన…
పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్‌కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం "WewantreRevenge" ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్‌లో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
కశ్మీర్ ట్రావెల్స్ కుదేలవుతుంది. పహల్గావ్ ఘటనతో టూరిస్టులు వెనక్కి తగ్గుతున్నారు. చావు కంటే వేసవి తాపం బెటర్ అంటున్నారు పర్యటకులు. కశ్మీర్ హోటళ్ళ నుంచి ఫ్యూచర్ క్రెడిట్ అవకాశాలు ఇచ్చాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నవి వచ్చే సీజన్ వరకూ రిజర్వులో ఉంచుకునే అవకాశం కల్పించాయి. విమాన టికెట్లు రద్దు చేసుకుంటే మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తున్నాయి విమానయాన సంస్థలు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఏర్పాటుతో టూరిస్టులకు ఊరట లభించింది.
ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.
ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.