NMC: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 4090 ఎంబీబీఎస్ సీట్లు యథాతథం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NATIONAL MEDICAL COMMISSION: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ(NATIONAL MEDICAL COMMISSION) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ఎంసీ (No Fines Imposed) ఒక్క కాలేజీకి కూడా జరిమానా విధించలేదు. 4090 ఎంబీబీఎస్ సీట్లు యథావిథిగా కొనసాగనున్నాయి.. ఫ్యాకల్టీ కొరతను అధిగమిస్తున్నా ఎన్‌ఎంసీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు టీచింగ్ ఫ్యాకల్టీకి పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది.. వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది.. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది.. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీల సమస్య తీరనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది.
READ MORE: Amazon Prime Day 2025: స్మార్ట్ టీవీలపై క్రేజీ డీల్స్.. సగం ధరకే.. ఇప్పుడు కొంటె వేలల్లో లాభం!
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ అంశాలన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. దీంతో ఎన్‌ఎంసీ సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్‌ఎంసీ లేవనెత్తింది. ఈ నేపథ్యంలో 21 టీచింగ్ హాస్పిటల్స్‌లో కలిపి సుమారు 6 వేలకుపైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు *మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)*లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును ఎన్‌ఎంసీకి అధికారులు వివరించారు. అన్ని కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లకు భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ఎన్‌ఎంసీ తెలియజేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్‌ఎంసీ, అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. 4 నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు అన్ని కాలేజీలకూ పర్మిషన్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.
READ MORE: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!