మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోందని ఈగల్ టీం ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని.. హోటల్ యజమానుష్టుల డ్రగ్స్ కేసులో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా వాళ్ల కోసం ఇంకా గాలిస్తున్నామని స్పష్టం చేశారు. మల్నాడు డ్రగ్ కేసులో పబ్ యజమానుల పాత్ర కూడా కీలకమేనని.. పబ్బు యజమానులు ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ కి అనుమతించారని చెప్పారు.. డ్రగ్ తీసుకుంటున్న సూర్య గ్యాంగ్ కి ప్రత్యేకమైన స్పేస్ ఇచ్చారని.. పబ్ లోపల సీక్రెట్ ప్రాంతాలు ఏర్పాటు చేసి సూర్యకు అందజేశారని వెల్లడించారు. సూర్య నిర్వహించే డ్రగ్ పార్టీలకు పబ్ యజమానులు సహకరించారని ఈగల్ ఎస్పీ వెల్లడించారు. 9 మంది పబ్ యజమానులకు నోటీసులు ఇచ్చి పిలుస్తామని.. పబ్బు యజమానుల పైన ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. మూడు పబ్ యజమానులు డైరెక్ట్ గా ఇందులో సూత్రధారుగా ఉన్నారని.. 23 మంది పబ్బు రెస్టారెంట్ హోటల్స్ యజమాని కలిసి డ్రగ్ పార్టీలు చేసుకుంటున్నారన్నారు.
READ ALSO: Amazon Prime Day 2025: స్మార్ట్ టీవీలపై క్రేజీ డీల్స్.. సగం ధరకే.. ఇప్పుడు కొంటె వేలల్లో లాభం!
ఇదిలా ఉండగా.. తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. ఈగల్ టీం నేతృత్వంలో అతిపెద్ద నెట్వర్క్ బట్టబయలు అయ్యింది. కొంపల్లి లోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. అంతేకాకుండా హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని కొన్ని ప్రముఖ పబ్ యజమానుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలైంది. ప్రతిరోజు పబ్బులలో డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు జరుగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి పది పబ్బుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు అధికారులు. మూడు పబ్బు యజమానులతో డైరెక్ట్ గా కాంట్రాక్టు పెట్టుకుని అక్కడ డ్రగ్ పార్టీలను నిర్వహించినట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
READ ALSO: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!