ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. ఈ గుండెపోటకు చెక్ పెట్టే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
గ్రూప్1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. ఆయన పిటిషనర్లకు 20వేల జరిమానా విధించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19మంది అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్సైట్లో ఉన్న మార్కులకు తేడాలున్నాయన్న పిటిషనర్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే…
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు..
తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ వంశీ అందుకూరి జీవితం, కష్టాలను సవాళ్లుగా మలచుకుని, కలలను నిజం చేసుకున్న అసాధారణ కథ. ఆర్థిక సంక్షోభాలు, సౌకర్యాల కొరత మధ్యలోనూ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో చదువును పూర్తి చేసిన వంశీ, మొబైల్ యాప్ టెస్టింగ్ రంగంలో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్లో నైపుణ్యం సంపాదించి, తన ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ధైర్యంగా ముందడుగు వేశాడు. ఈ రోజు, సాంకేతికత, మీడియా, ఆటోమోటివ్…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 26 మంది అమాయక జనాలు చనిపోడంతో సంతాపం ప్రకటిస్తు్న్నారు. పర్యటకులను కాల్చి చంపే ముందు.. ఉగ్రవాదులు వారి మతం గురించి అడిగారు. మానవాళికే సిగ్గుచేటు తెచ్చిన ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ నగరం భగత్ సింగ్ చౌక్ సమీపంలోని రోడ్లపై నిరసన కారులు పాకిస్థాన్ జెండాలు, పోస్టర్లు అతికించారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి అసెంబ్లీకి పోవడం లేదన్నారు. రేవంత్, కేసీఆర్…
గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పరీక్షపై టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
నకిలీ ధృవపత్రాలతో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్స్ తో ఆర్మీ ఉద్యోగాలంటూ ఎన్టీవీలో వచ్చిన వరుస కథనాలపై పోలీసుల విచారణ ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురి పై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూరజ్ సహాని, గజేంద్రా, దిగ్విజయ్‌పై కేసు నమోదైంది. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ లో కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్లు దరఖాస్తు చేశారు. ఆర్మీ ఉద్యోగాలకు నివాస ధృవ పత్రాలు నకిలీవి ఇచ్చినట్లుగా…