రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన చెన్నై.. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకుంది. 10 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై, ఆర్సీబీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇది.. 10 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో గెలిచింది. టేబుల్ లో మూడో స్థానాన్ని…
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్‌కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.
గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. తన భారీ ఇన్నింగ్స్‌ల కారణంగా గుజరాత్ ఈ రోజు టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా సాయి సుదర్శన్ సన్ రైజర్స్ పై ఊచకోత కోశాడు. 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో శతకొట్టాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సాయి సుదర్శన్ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేడుకున్నాడు.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మీలో ప్రతిభ ఉంటే.. ఎవ్వరూ ఆపలేరని నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన సూర్యవంశీ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా ఈ క్రీడారుడిని కాపాడుకోవాలంటూ.. క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి హెచ్చరించారు. ఛాపెల్ గతంలో టీం ఇండియా కోచ్‌గా కూడా పనిచేశారు. సూర్యవంశీ రాణించాలంటే సచిన్ టెండూల్కర్ లాంటి మద్దతు అవసరమని ఆయన అన్నారు.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ తీసుకొనే నిర్ణయం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుందని…
దేశంలో ఓ వైపు వరకట్నం వేధింపులు పెరుగుతున్నాయి. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నిండు గర్భిణులు సైతం ఆత్మహత్య చేసుకున్న చాలా ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ.. ఈ విషయం మాత్రం ప్రస్తుతం అందరినీ అబ్బురపరుస్తోంది. కలియుగంలోనూ ఓ యువకుడు పెద్ద మనసు చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగిచ్చేసి ఆదర్శంగా నిలిచాడు. వరుడి సూచన మేరకు కేవలం రూపాయి నాణెం, ఒక కొబ్బరి కాయతో మొత్తం వివాహ క్రతువు ముగించేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి కొత్వాలీ ప్రాంతంలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు జౌన్పూర్ జిల్లా మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లోహిండా నివాసి రాజ్ నారాయణ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు కేవలం సాధారణ కారు మాత్రమే కాదు. దాన్ని రాజ్ నారాయణ్ ఓ హెలికాప్టర్ రూపంగా మార్చారు. ఆ వాహనాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే.. ఈ కారును పెళ్లిళ్లలో వధూవరుల ఊరేగింపు కోసం అద్దెకు…
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రులు ఆమోదం తప్పని సరి అని పేర్కొన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో […]
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామని…