Madhavi Latha: రాజమౌళి దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారని బీజేపీ నాయకురాలు మాధవి లత పేర్కొన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నమ్మకాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందువులు తేరగా దొరుకుతున్నారా? రాముడికి ఒకే పెళ్లాం ఉంది అంటున్న రాజమౌళికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారు? అని ప్రశ్నించారు. కర్మ ఫలితం అనుభవించాడు కాబట్టే ఆంజనేయుడు లేడని అన్నాడు.. సినిమా చూసే మా వాళ్లకు బుద్ధి ఉండాలని హిందువులను ఉద్దేశించి అన్నారు. వందల కోట్లు సంపాదించిన నీవు.. బాహుబలి సినిమాకి పనిచేసిన వారికి ఏమైనా ఇచ్చావా? అని నిలదీశారు. రాజమౌళి భక్తిని తీసుకురాలేదు… దాన్ని వాడుకుంటున్నారన్నారు. భక్తే లేదు అనే వాడి దగ్గరికి మనం వెళ్తామా? నీవు ఏమి దైవ సేవ చేశావ్.. అయిన దేవుడు అన్ని కోట్లు ఇచ్చాడు కదా..? అని నిలదీశారు.
READ MORE: India Defense Industry: చరిత్ర సృష్టించిన భారత్.. రక్షణ ఉత్పత్తిలో ఇండియా నయా రికార్డ్
నీకు ఎందుకు అంతా బాధ.. మనమే మన హిందూ ధర్మాన్ని కించ పరుస్తున్నామన్నారు మాధవి లత.. “మా కష్టం మీద విష బిందువు వేస్తున్నారు.. దయచేసి మీరు ఇలాంటి కామెంట్స్ చేయకు.. వ్యక్తి గతం అయితే ఇంట్లో మాట్లాడుకోవాలి.. ఆయన మాట్లాడింది వ్యక్తిగతం కాదు.. సినిమా వాళ్లు ఈ అంశంపై స్పందించక పోవడం వాళ్ల సొంతం.. అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు దైవ దూషణ చేయలేదు.. మన మతం మీద మనమే సినిమాలు తీస్తూ దూసిస్తే ఎలా? సినిమా చూసే వాళ్లు కూడా భక్తి లేదని అనుకుంటే ఆయన వ్యాపారం తుస్సు మంటుంది.. ఆయనకు సామాజిక బాధ్యత లేదు.. టికెట్ కొనుక్కుని సినిమా చూసే వాళ్ళను అవమానించారు.. మనసు గాయ పరిచారు.. అందరూ నాస్తికులు అయితే నీ సినిమా చూసేది ఎవరు? నా దేవుళ్ళను ఒవైసీ బ్రదర్స్ అవమానించారని నేను రాజకీయాల్లోకి వచ్చాను.. నా దేవుళ్ళ పైకి ఎవరు వచ్చిన ఊరుకోను.. నాకు పదవి వచ్చిన రాకున్నా ఇలానే ఉంటా.. రాజమౌళి మాటల ప్రభావం పడుతుంది.. ఆంజనేయ స్వామిని అన్నావు కాబట్టే ఇప్పుడు నీకు చుట్టుకుంటుంది.. షూటింగ్ లలో దేవుణ్ణి ఇంకా ఏమన్నావో..? రాజమౌళి తో సమాధానం భగవంతుడు ఇప్పిస్తారు.. దేవుడు ఉన్నాడు అని ఆయనతోనే చెప్పిస్తారు.. బస్తీ మే సవాల్ చూడండి.. ఆయన మీద జాలి కూడా పోయింది.. రాముడి మీద అసహ్యంగా మాట్లాడారు.. ఆయనకు క్షమాపణకు కూడా అర్హత లేదు.. తగిన గుణపాఠం చెప్పాలి..” అని రాజమౌళిపై ఫైర్ అయ్యారు.