Marijuana Addiction: గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అయితే.. ఈ గంజాయి గురించి తాజాగా ఓ కీలక విషయం బయటకు వచ్చింది.
READ MORE: Nepal Gen Z Protests: నేపాల్‌లో మళ్లీ జెన్-జెడ్ నిరసనలు.. ఏమైందంటే..
గంజాయి అంటే మగవారు మాత్రమే తాగుతారనే వాదనలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కానీ.. తాజాగా కీలక సమాచారం బయటకు వచ్చింది. మహిళల్లోనూ గంజాయి వ్యసనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యువతులు కలిసి పార్టీలు చేసుకునే సందర్భంలో గంజాయి వ్యసనం పెరుగుతుందని చెబుతున్నారు. గంజాయిని రుచిచూసిన తోటి యువతులు బాగా తెలిసినవారి ప్రోద్బలంతోనే అమ్మాయిలు దీని ఊబిలోకి దిగుతుంటారు. గంజాయి సేవించడం వల్ల అందం ఇనుమడిస్తుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, బిడియం తగ్గుతుందనే అపోహలున్నాయి. ఈ అపోహలను నమ్ముతున్న యువతులు ఈ ఊబిలో పడుతున్నారు. అంతేకాదు.. గంజాయి వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయం తెలిసిందే. అయితే.. గంజాయితో ప్రతికూల ప్రభావాలు, అనారోగ్య సమస్యలు మగాళ్ల కంటే.. ఆడవారిలోనే త్వరగా మొదలవుతాయి. కొంత మంది అమ్మాయిలు దీనికి వ్యసనంగా మారి వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో అనేక చిన్నతనంలోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
READ MORE: Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్