రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. చాలా మంది త్వరగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే.. రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే సమ్మర్ లో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. నిపుణులు చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించాలి.
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు…
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ జరిగే సమయంలో వర్షం వస్తుందని తాము అనుకున్నట్లు చెప్పారు. మోడీ ఓ మాట చెప్పారని గుర్తు చేశారు. ” ఈ రోజు వర్షం వస్తుందని మేము అనుకున్నాం. కానీ మోడీ వస్తున్నారంటే.. వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ అమరావతి పవర్. ఇప్పుడే ప్రధాని నాతో ఓ మాట అన్నారు. నా 25 […]
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. 2000 రైతుల ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. రైతులు నలిగి బాధపడి, తమ కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? అని చాలామంది మహిళలు రైతులు ఆ రోజుల్లో తను అడిగిన సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి…
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ మాట్లాడారు. పహల్గాం దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదిక మీద నుంచి పాకిస్థానీయులను హెచ్చరించారు.
గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలోనే టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ కు తరలించాలని కంపెనీ యోచిస్తున్నట్లు స్పష్టమైంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్లోనే తయారు చేస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. అమెరికాలో భారీ సంఖ్యలో విక్రయించబోయే ఐఫోన్లకు భారత్ కీలక…
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.