Internal jihad: భారత్‌లో దేశ ద్రోహులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ దేశం తిండి తింటూ పరదేశం పాట పాడుతున్నారు. పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పడం భారతదేశానికి కష్టం కాదు. కానీ.. దేశంలో దాక్కున్న దేశద్రోహులను నిర్మూలించడం కష్టతరంగా మారుతోంది. భారత పౌరులమని చెప్పుకునే వారు.. ఈ దేశ గాలి పీలుస్తూ, ఇక్కడి నీరు తాగుతూ.. ఇక్కడే విద్యను అభ్యసిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల బయటపడిన రెండు సంఘటనలు భారత్‌లో ఈ “అంతర్గత జిహాద్” ని బయటపెట్టాయి. ఈ రెండు ఘటనలే కాదు.. ఇంకా దేశంలో అనేక మంది కుట్రదారులు ఉన్నారనేది చేదు నిజం..
READ MORE: Paanch Minar Review: పాంచ్ మినార్ రివ్యూ: రాజ్ తరుణ్ నమ్మకం నిలబడిందా?
కశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో ఆయుధాలు..
జమ్మూ కశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ బుధవారం ప్రముఖ వార్తాపత్రిక కశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడి చేసింది. దర్యాప్తు బృందం కార్యాలయం నుంచి AK-47 రైఫిల్ కార్ట్రిడ్జ్‌లు, పిస్టల్ బుల్లెట్‌లు, హ్యాండ్ గ్రెనేడ్ పిన్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆయుధాలు ఒక మీడియా సంస్థలో ఏ ప్రయోజనం కోసం దాచారనేది అతిపెద్ద ప్రశ్న. ఎవరి ఆదేశాల మేరకు, ఏ ప్రయోజనం కోసం ఈ ఆయుధాలు ఇక్కడ నిల్వ చేశారు? అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలలో కశ్మీర్ టైమ్స్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అయితే, వార్తాపత్రిక సంపాదకులు ప్రబోధ్ జామ్వాల్, అనురాధ భాసిన్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తమను బెదిరించడానికి ఈ చర్య తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
“వైట్-కాలర్ టెర్రర్” నెట్‌వర్క్ బట్టబయలు..
అంతేకాదు.. ఇటీవల అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని లాకర్ నుంచి పోలీసులు AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆ రైఫిల్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌కు చెందినదని తేలింది. ఇది వైద్యుల ఉగ్రవాద మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ నెట్‌వర్క్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన అనేక మంది వైద్యులను అరెస్టు చేయడానికి దారితీసింది. ఇది “వైట్-కాలర్ టెర్రర్” నెట్‌వర్క్ అప్పుడే బయటపడింది. విద్యావంతులు, ప్రొఫెషనల్ వ్యక్తులతో కూడిన నెట్‌వర్క్ అని స్పష్టమైంది. దీని రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సూత్రధారుల ఆధీనంలో ఉందని దర్యాప్తులో తేలింది. ఈ వైద్యులు దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే దాడులకు సిద్ధమైనట్లు తేలింది. ఈ వైద్యుల మాడ్యూల్ జైష్-ఎ-మొహమ్మద్‌తో ముడిపడి ఉంది. భారతదేశంపై కుట్ర పన్నడానికి జైష్ బంగ్లాదేశ్‌ను ఉపయోగిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు తర్వాత.. అక్కడి ఉగ్రవాదులకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. పాకిస్థాన్‌లోని అగ్రశ్రేణి ఉగ్రవాదులు, జైష్-ఎ-మొహమ్మద్ నిర్వాహకులు బహిరంగంగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల.. మజార్ సయీద్ షా బంగ్లాలోకి ధైర్యంగా ప్రవేశించడమే ఇందుకు ఉదాహరణ. సయీద్ షా మసూద్ అజార్‌కు దగ్గర వ్యక్తిగా చెబుతారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని ముస్లింలు భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యమయ్యారని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని షా పిచ్చికూతలు కూస్తూ అక్కడి జనాలను రెచ్చగొడుతున్నా బంగ్లా ప్రభుత్వం చేతులు ముడుచుకని కూర్చుంది.