జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ రగిలిపోయింది. దీని ప్రతీకార చర్యను పాకిస్థాన్ గుర్తించలేక పోయింది. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ సఫలమైంది. భారత సైన్యం దూకుడు విధానాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ వైమానిక దాడి సంవత్సరాల తరబడి పాకిస్థాన్లో ప్రతిధ్వనిస్తుంది. ఈ దాడిలో అత్యంత భయంకరమైన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కుటుంబీకుల రక్తం చిందింది. వందలాది మందిని పొట్టన బెట్టుకున్న ఈ మూర్ఖుడు తన కుటుంబీకుల్లో పది మందిని పోగొట్టుకోగానే కన్నీరు కారుస్తున్నాడు.
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు లభించింది.. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు ప్రదానం చేయనుంది.. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు దక్కింది.. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డు ప్రదానం చేస్తారు.. ఈ ముఖ్యమైన వేదిక అయిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025 కు 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు ఒకేచోట సమావేశమవుతున్నారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల…
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు 'ఆపరేషన్ అభ్యాస్' అనే కోడ్ పేరుతో…
ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి అని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి చీట్చాట్ నిర్వహించారు. బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.. బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను.పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..?
ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న కొన్నిరోజుల్లో పాకిస్థాన్పై భారత్ ఏదైనా చర్య…