జమ్మూలో ఈరోజు భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీని తరువాత ఎయిర్ సైరన్లు మోగాయి. జమ్మూ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు. జమ్మూలో 5-6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించాయి. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోంది. మాతా వైష్ణో…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అందులో పేర్కొన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్థాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు. ఉగ్రవాదం, పౌరుల హత్యలను వ్యతిరేకించారు. ఇస్లామిక్ బోధనలు, అంతర్జాతీయ సూత్రాలు, మానవ విలువలలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహదుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ నక్సలైట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.
మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత సైన్యంలోని ఇద్దరు మహిళా అధికారులు సోఫియా…
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..
ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్‌పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అనేక ఉగ్రవాద…
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చించారు.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారతదేశానికి లేదని.. కానీ మా దేశంపై సైనిక దాడులు జరిపితే.. గట్టి సమాధానం ఇస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అబ్దుల్ రవూఫ్ అజార్ కందహార్లో IC-814…