హైదరాబాద్లోని ప్రణామ్ ఆసుపత్రి ఓ రోగి ప్రాణాలను కాపాడింది. ప్రణామ్ హాస్పిటల్స్ కి చెందిన సర్జికల్ బృందం ఒక రోగి కడుపులో నుంచి 8.5 కిలోల భారీ అండాశయ కణితిని తొలగించింది. అధునాతన వైద్య పరికరాలు, పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఈ ఆస్పత్రి బృందం కణితిని విజయవంతంగా తొలగించి మరో మైలురాయిని సాధించింది. ఈ వ్యాధి బారిగన పడిన రోగి మధ్య వయస్కురాలు. ఆమె కొన్ని నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాపుతో బాధపడుతున్నారు. రోగిని సమగ్రంగా పరీక్షించిన వైద్య బృందం రోగాన్ని…
ప్రేమలో పడితే సంతోషమే సంతోషం. చాటింగులు, డేటింగులు, ముద్దులు, ముచ్చట్లు, సినిమాలు, షికార్లు ఇలా ప్రేమికులకు లోకమంది ఇంద్రధనుస్సులో కనిపిస్తుంది. ప్రేమలో ఎంత సంతోషంగా ఉంటారో.. బ్రేకప్ అయితే మనస్సు ముక్కలై కుమిలిపోతారు. అంతకుముందు ఇంటిపటున ఉండకుండా తిరిగేవారు. బ్రేకప్ తర్వాత ఇంటినుంచి బయటకు రాకుండా జీవితమే కోల్పోయినట్లుగా కుమిలిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. జీవితం ముక్కలైపోయిందని కృంగిపోతారు. ప్రేమ అనేది జీవితంలో భాగమే తప్ప ప్రేమే జీవితం ప్రేమికులు దూరం అయితే ఇక జీవితమే లేదని అనుకోకూడదు. బ్రేకప్ వల్ల చాలా ముఖ్యమైన…
ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి. ఇందులో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అంశాల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు సాధించడం ఒకటి. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్లు అభిమానుల మనసుల్లో నిలిచిపోయేలా మారాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా అంతే.. ఈ మ్యాచ్లో రొమారియో షెపర్డ్ ఊచకోత కోశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బరిలోకి దిగిన ఆర్సీబీ అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్ కోహ్లీ తుఫాను చెన్నై బౌలర్లకు చుక్కలు చూయించాడు. బెతెల్ అర్ధ శతకంతో అదరగొట్టాడు.
ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే హ్రస్వదృష్టి. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు... రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి.