మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా…
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక…
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆమెకు దాదాపు 5 వేల ఓట్లు…
పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్‌కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా ఆసుపత్రికి వెళ్ళి రాత్రి దాదాపు 11…
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని.. తిప్పికొట్టండని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కానీ…
ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. పిడుగులతో కూడిన…
వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.