ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.
READ MORE: CM Chandrababu: నేను ఎప్పుడైనా నేరం, హత్యా రాజకీయాలు చేశానా..? సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. అతడు ఆసుపత్రిలో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. వైద్యులు టెస్టు్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. పక్కనే ఉన్న భార్య మాత్రం ఈ సన్నీవేశాన్ని తన ఫోన్‌లో బంధించింది. ఫోన్ తీసి బెడ్‌పై పడుకుని ఉన్న భర్తను చూపిస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భార్యాభర్తల వయసు ఆరుపదులు ఉండొచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన భర్త ఆసుపత్రిలో ఉన్నప్పటికీ.. అస్సలు బాధపడటం లేదు. రీల్ చేయడంతో నిమగ్నమై పోయింది. ఈ వయసులో ఆ వృద్ధ మహిళకు ఇదేం పోయే కాలం అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం తెగ వైరల్ అవుతోంది. ప్రజలు ఈ మహిళను తెగ ట్రోల్ చేస్తున్నారు.
READ MORE: Balmuri Venkat : కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్.. చర్చకు సిద్ధమా..?