మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి. శనివారం మద్యం మత్తులో సన్యాసిరెడ్డి, బోడెమ్మను దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మారేడుమిల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మల్లిరెడ్డి ప్రస్తుతం మారేడుమిల్లి పోలీసులు అదుపులో ఉన్నాడు.
READ MORE: Live-in Relationship: సహజీవనం చేస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.. కానీ అది నిరూపించాలి..!