భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం […]
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
భారత సైన్యం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ తీవ్రంగా కృంగిపోయింది. రోజురోజుకూ ఓటమి వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. ఇప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ సైన్యం కొత్త అబద్ధాలను పుట్టిస్తోంది. అయితే.. శనివారం మరో కొత్త దుష్ర్పాచారం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణితో విజయవంతంగా దాడి చేశామని, ఈ దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని పాకిస్థాన్ పేర్కొంది.
దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టినట్లు ఇటీవల పేర్కొంది. తాజాగా మరో…
గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే ఈ దాడి, ఓటమి నుంచి తాము…
భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.