Hyderabad: అన్న ఇంట్లోనే దొంగతనం చేసిన చెల్లి.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగ మారీ…
- గాజులరామారంలో ఉంటున్న వేముల శ్రీకాంత్
- కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు
- తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న చెల్లెలు ఆమని
- 8 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న ఆమని
- ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడ్డ ఆమని
- 5 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్న ఆమని
- అన్నతో విభేదాల వల్ల అతడి ఇంట్లో చోరీకి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. కానీ అలాంటి ఇంటి దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న ఇంటిలోనే చోరీ చేసిన చెల్లెల్ని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ గాజులరామారంలోని షిరిడీ హిల్స్‌లో కొంత కాలంగా వేముల శ్రీకాంత్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నారు. కొత్త కారు పూజ కోసం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఆమని కూడా నివాసం ఉంటోంది.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఆమనికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. కానీ భర్తతో విభేదాలు రావడంతో 8 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటు పడింది. అలా ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకుంది. పలువురి దగ్గర అప్పులు కూడా చేసింది. ఓ వైపు అప్పులు.. ఆన్ లైన్ గేమ్స్ కోసం డబ్బులు లేకపోవడం ఓ స్కెచ్చేసింది. అన్న శ్రీకాంత్‌తో ఉన్న విభేదాల కారణంగా.. అతడి ఇంట్లో చోరీ చేయాలని డిసైడ్ అయింది.. ఈ క్రమంలోనే తన స్నేహితులు కార్తీక్, అఖిల్‌తో కలిసి కుట్ర చేసింది. అన్న ఇంట్లో ఉన్న నగదు, బంగారం కొట్టేయాలని ప్లాన్ చేసింది ఆమని. అంతే.. అన్న, వదిన వచ్చిన రోజే వారి ఇంటి తాళం చెవి కొట్టేసింది. అర్ధరాత్రి కార్తీక్, అఖిల్‌కు ఆ తాళం చెవి ఇచ్చి గాజుల రామారంలోని శ్రీకాంత్ ఇంట్లో చోరీ చేయాలని చెప్పింది. వారు వచ్చి కీ తీసుకుని వెళ్లారు. ఇంట్లో ఉన్న డబ్బు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకుని తిరిగి వచ్చారు. మళ్లీ యథావిధిగా ఇంటి తాళం చెవిని ఆమనికి అప్పగించారు.
READ MORE: Thailand: బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసిన యువతి.. ప్రయివేట్ వీడియోలతో రూ. 102 కోట్లు వసూల్..
ఇంటికి తిరిగి వెళ్లిన శ్రీకాంత్.. చోరీ జరిగినట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. డబ్బు, బంగారం మాయమైందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న వాళ్లే చోరీ చేశారని ఓ అంచనాకు వచ్చారు. ఐతే ఆమని బెట్టింగ్ విషయం తెలియడంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కొంత బంగారాన్ని ఓ గోల్డ్ లోన్ కంపెనీ వారి దగ్గర కుదువ పెట్టి ఆమని డబ్బులు తెచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చోరీ కోసం నిందితులు ఉపయోగించిన సుత్తి, ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!