సీబీఐలో సంచలన కేసులను విచారించడంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మంచి గుర్తింపు ఉంది. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. తాను జాబ్‌కు రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఓపెన్‌గా చెప్పారు. తాను రూరల్ డెవలెప్ మెంట్‌కు వెళ్లాలనుకున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఓ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ ఇంటర్య్వూకి వెళితే “నువ్వు పోలీసులు అఫీసర్‌వి నువ్వేం చేస్తావ్” అని పోస్ట్ ఇవ్వలేదని.. అందుకే తాను రిజైన్ చేసినట్లు వెల్లడించారు.
“నేను రూరల్ డెవలెప్ మెంట్‌కు వెళ్లాలనుకున్నాను. అది నాకు ఆసక్తి. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఓ డీడీజీ పోస్టుకి అడ్వటైజ్‌మెంట్ వేశారు. నేను డీజీగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్లాను. నాకు గ్రామీణాభివృద్ధి అంటే ఇష్టం. కాబట్టి నాకు ఇందులో జాబ్ దొరికితే ఇండియా లెవల్‌లో అభివృద్ధి చేయొచ్చుకదా అన్న ఉద్దేశంతో అనే అప్లై చేశాను. ఇంటర్వ్యూకి వెళితే.. నువ్వు పోలీసులు అఫీసర్‌వి నువ్వేం చేస్తావ్ అన్నారు. నేను పోలీసుగా ఉంటూనే గ్రామాలకు ఏం చేశానో వాళ్లకు వివరించాను. చెప్పినా కూడా వాళ్లు నన్ను ఎంపిక చేయలేదు. మళ్లీ ఒక ఏడాది తరువాత అదే పోస్ట్‌కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టుకు దాదాపు 5 ఏళ్ల నుంచి ఎవ్వరూ రావటం లేదు. కానీ నేను మళ్లీ ఇంటర్వ్యూకి వెళ్లాను. నన్ను చూసి మళ్లీ ఎందుకు వచ్చావ్ అన్నారు. రూరల్ డెవలప్‌మెంట్ అంటే నాకు ఆసక్తి అందుకే వచ్చాను అన్నాను. మళ్లీ నువ్వు పోలీసులవి అన్నారు. కాబట్టి ఆ పోస్టు నాకు రాలేదు. నాకు ప్యాషన్‌గా ఉన్న అంశంపై పోరాడుదాం అనుకుంటే నాకు అవకాశం రాలేదు. ఈ ఖాకీ అడ్డం వస్తోంది అని రిజైన్ చేసేశాను. నేను రాజీనామా చేయడానికి వీళ్లు పోస్ట్ ఇవ్వక పోవడమే కారణం. భారతదేశంలో గ్రామాలతో నిండిన దేశం. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ లో కూడా దేశాన్ని, దేశ ఆర్థిక పరిస్థితి కాపాడింది రైతులు. కాబట్టి అటువంటి రైతాంగం కోసం ఏదైనా చేయొచ్చు కదా అనే భావనతో వెళ్లాను. వాళ్లు ఇవ్వక పోవడంతో ఎమోషనల్‌గా అయిపోయి రాజీనామా చేశాను.” అని లక్ష్మీనారాయణ వెల్లడించారు.