Cancer Prevention Foods: క్యాన్సర్ ముప్పును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే.. తప్పక తినండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు. ప్రస్తుతం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిగా నిద్రపోవడం, ధూమపానం, మద్యపానం వంటివి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం. ఇది కాకుండా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ఈ ప్రమాదకరమైన వ్యాధి కేసులు కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్‌ను జయించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి చాలా వరకు క్యాన్సర్ ముప్పును తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
కాయధాన్యాలు: బీన్స్, చిక్కుడు మొదలైన కాయధాన్యాలు రొమ్ము క్యాన్సర్‌ను బాగా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలోని షుగర్ స్థాయులను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.
బ్రకలీ: ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుంది.
నారింజ: నారింజలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. అంతేగాక చెడు కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.
గ్రీన్ టీ: ఇది యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అన్నవాహిక, వూపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ఇందులోని పాలీఫినాల్స్ కొత్త కణాలను భర్తీ చేస్తాయి.
READ MORE: NCERT: పాఠ్యాంశాలుగా ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్ మిషన్..
అల్లం: ఇది క్యాన్సర్ కణాలను తమంత తాముగా నశించేటట్లు చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అడ్డుకుంటుంది.
వెల్లుల్లి: ఇందులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.
యాపిల్: రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమే. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సాల్మన్ చేపలు: సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వివిధ విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం దీని నుండి లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును కూడా అడ్డుకుంటాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?