Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి.. గంటకు 40వేల లీటర్ల నీరు చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydrogen-Powered Train: భారత్ విద్యుత్, డీజిల్‌తో నడిచే సాంప్రదాయ రైళ్లను వదిలివేసి.. హైటెక్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల నెట్‌వర్క్‌ను సృష్టించడంలో బిజీగా ఉంది. బుల్లెట్ రైలు, హైపర్‌లూప్, మోనో రైలుతో పాటు, హైడ్రోజన్ రైలు తయారీలో వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ఈ కాలుష్య రహిత రైళ్లు కలిగిన ఐదవ దేశంగా భారత్ అవతరించనుంది. ఇందులో భాగంగా.. మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే కోచ్ (భారతదేశంలో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్) శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా సమాచారం అందించారు. భారతదేశం 1200 హార్స్‌పవర్ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. అసలు ఏంటి ఈ హైడ్రోజన్ రైలు, ఇది ఎలా నడుస్తుంది? అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…
Also Read
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
కాగా.. మొదటి రైలు హర్యానాలోని జింద్, సోనిపేట మధ్య 89 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ రైలుకు 1,200 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజిను అమర్చనున్నారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.2,300 కోట్లతో 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఒక కోచ్ నిర్మాణం పూర్తయింది. తాజాగా విజయవంతంగా పరీక్షించారు. ఈ రైళ్ల వల్ల కర్బన ఉద్గారాలు, శబ్దం బాగా తగ్గుతాయి. రాబోయే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అనేక ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన రైళ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రైలు నడవడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ వినియోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. ఈ రైలు నడిచేందుకు గంటకు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్లు వెళ్లగలదు.
READ MORE: Cobra snake: విచిత్రం.. నాగుపామునే కరిచి చంపిన ఏడాది బాలుడు..
తాజావార్తలు
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!