జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదల సేవలో తాను ఉండాలని సింగపూర్ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చినట్టు తెలిపారు. తాజాగా కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 64 లక్షల మందికి 33 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదలకు ఇస్తున్నామని చెప్పారు. ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో పెన్షన్ ఎగ్గొట్టేవారు.. ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తాం. రెండు నెలలు లేకపోయినా మూడవ నెలలో ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.. పెన్షన్ల పంపిణీ ఇష్టానుసారంగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఎక్కడ పెన్షన్ పంపిణీ చేశారో తెలుసుకునే యంత్రాంగాన్ని పెట్టామన్నారు.. పెన్షన్ల పంపిణీలో లంచాలు అడిగారా అని ఆరా తీస్తున్నామన్నారు.. పెన్షన్లు ఉద్యోగులు పేదలకు గౌరవప్రదంగా ఇవ్వాలి… 89 శాతం పెన్షన్లు బాధితుల ఇళ్ల వద్ద ఇచ్చామని వెల్లడించారు…
READ MORE: ENG vs IND: అందరికీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్‌లోకి వెళ్లాడు
వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని టీవీలో చూశా అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మధ్యాహ్నానికి మళ్లీ మాట మార్చారని.. తెల్లవారేసరికి నారాసుర చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టారన్నారు.. నెల్లూరుకు వెళితే తప్పులేదు. ఓ మహిళను ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి ఆయనను రెచ్చగొట్టారన్నారు… ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలా? అని ఆడబిడ్డలను అడిగారు. తమ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలని.. కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అప్పుడే అందరూ భయపడతారన్నారు. “నిన్న నెల్లూరుకు వెళితే, బంగారుపాలెంలో వచ్చిన జనం విజువల్స్ చూపించారు. తోక తిప్పితే తోక కట్ చేస్తా.. మంచిగా తిరిగితే నాకు అభ్యంతరం లేదు.. మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే ఊరుకోం.. తోక తిప్పిన వారిపై నేరుగా కేసులు పెడతారు.” అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
READ MORE: Khalid Jamil: 13 ఏళ్ల తరువాత ఇండియన్ టీంకి స్వదేశీ కోచ్‌గా ఖలీద్ జమీల్…