Hyderabad: చెప్పేవాడికి నమ్మేవాడు లోకువ. అందుకే ఏది పడితే అది చెప్పి నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంత మంది అందిన కాడికి దోచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు ఇప్పుడు సమాజంలో ఎక్కువగానే తారసపడుతున్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటి కిలాడీ వ్యక్తి ఒకడు చాలా రోజులుగా జనాలను చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి హాయిగా బతికేస్తున్నాడు. చివరకు పాపం పండి.. పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు..? ఎలా చిక్కాడు..?
READ MORE: Off The Record: మూడు సార్లు గెలిపించినా ముఖం చూడ్డంలేదు.. ఎమ్మెల్యేపై కేడర్ ఫైర్..!
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చూడ్డానికి డాక్టర్‌లాగే ఉన్నాడు కదా..!! యస్.. మీరు ఊహించింది కరెక్టే.. ఇతడు ఫేక్ డాక్టర్. వైద్య వృత్తిలో ఉన్నానని.. హైదరాబాద్‌లోని ఓ పెద్ద ఆస్పత్రిలో పని చేస్తున్నానని జనాలను మోసం చేస్తున్నాడు. ఈ కంత్రీగాడి పేరు విక్రాంత్ రెడ్డి. డాక్టర్‌నని ఓసారి.. ఓ ఎంపీ కుమారుడినని మరోసారి.. జ్యువెలరీ షాపులకు ఓనర్‌నని ఇంకోసారి చెబుతూ మోసం చేస్తున్నాడు.. నిజానికి గుంటూరు జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. అమాయకులకు వల విసరడం, వారిని తన మాటలతో బురిడీ కొట్టించడం విక్రాంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అంతే కాదు తాను చెప్పే వృత్తికి తగ్గట్టుగా తన వేషధారణ మార్చుకుంటాడు. అందుకు తగ్గట్టు లగ్జరీ కార్లు కూడా ఏర్పాటు చేసుకుని బిల్డప్ ఇస్తాడు..
READ MORE: Hyderabad: రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్.. వేధింపులు తాళలేక సూసైడ్..!
చాలా రోజులుగా జనాన్ని మోసం చేస్తూనే డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ ఇటీవల కూకట్‌పల్లిలో ఓ హాస్టల్ యజమానికి టోకరా వేయబోయి దొరికిపోయాడు. కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో తన మిత్రున్ని చేర్పించేందుకు వెళ్లాడు విక్రాంత్ రెడ్డి. కానీ అదే హాస్టల్లో 4 వారాల పాటు తిష్ట వేశాడు. ఈ క్రమంలో హాస్టల్ యజమానితో పరిచయం ఏర్పడింది. దీంతో అతన్ని చీట్ చేయడానికి ప్లాన్ చేశాడు విక్రాంత్ రెడ్డి. తనకు జూబ్లీహిల్స్‌లో గోల్డ్ షాప్ ఉందని నమ్మించాడు. అవసరమైతే మీ పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకోవచ్చని తెలిపాడు. యజమాని నమ్మి బంగారు ఆభరణాలు అప్పగించడంతో అవి తీసుకుని వెళ్లిపోయాడు.. కొద్దిరోజులు చూసిన హాస్టల్ యజమాని తన ఆభరణాల కోసం కాల్ చేశాడు. బంగారు ఆభరణాల కోసం అడిగాడు. కానీ విక్రాంత్ రెడ్డి ప్లేట్ ఫిరాయించాడు. ఆభరణాల కోసం అడిగితే తన తండ్రి ఎంపీ అని.. ఆ పలుకుబడితో నిన్ను ఏమైనా చేస్తానని బెదిరించాడు. ఈ దెబ్బతో షాక్ తిన్న హాస్టల్ యజమాని కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. విక్రాంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు.. ఈ కేసులో సీరియస్‌గా రంగంలోకి దిగిన పోలీసులు.. చివరికి విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అసలు విక్రాంత్ రెడ్డి డాక్టర్ కాదని.. అతడు ఎంపీ కుమారుడు కానే కాదని.. అతనో పోకిరీ అని.. జల్సాలకు అలవాటు పడి మోసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మోసాలు చేయగా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు..